
బ్రహ్మపుర నగరం: గంజాం జిల్లా బ్రహ్మపురలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్త్రీ రోగ, ప్రసూతి విభాగం లోపలి వార్డు భవనంలో రెండో అంతస్తులోని శస్త్ర చికిత్స గదిలో ఉన్న ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఎంకేసీజీ ఆవరణలోని అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు నియంత్రించారు. ప్రమాదంలో పలు వైద్య పరికరాలు దగ్ధమయ్యాయి. ఎంకేసీజీ డీన్, ప్రిన్సిపల్ ఆచార్య హరే కృష్ణ దొలాయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సుదీప దాస్‌లు ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





