
అమృతలూరు: రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అమృతలూరు మండలానికి సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు మంగళవారం విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జాబితాను మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఓటర్లు, ప్రజలు సెప్టెంబరు 16లోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయాలని ఎంపీడీవో వినయ్ బాబు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సెప్టెంబరు 16న ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందిన అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో సెప్టెంబరు 19న తుది పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంజినీర్స్ డే వేడుకలు.. ప్రతిభ పరీక్ష అమృతలూరు: ఇంజినీర్స్ డే సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (హైస్కూల్ ప్లస్)లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు 49 మంది పరీక్ష రాశారు. ధనలక్ష్మి ప్రథమస్థానం, అమృత ద్వితీయ స్థానం, ఇందు, శైలి తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నిరీక్షణరావు, ఉపాధ్యాయులు రవి, స్వరూపరాణి, సునీత, శ్రీవిద్య, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు వెంకటేష్, గోపయ్య, వంశీ, త్రివేణి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





