
కుక్కను పోలిన ముఖం.. పులిని తలపించే నల్లటి చారలు.. ఆడ జంతువుకు పిల్లలను మోసే సంచి.. ఇవన్నీ కలిసిన అరుదైన జీవి తాస్మేనియన్ టైగర్. అసలు పులి కానప్పటికీ ఆ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ జంతువు 1936లో పూర్తిగా కనుమరుగైంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా, టాస్మానియా ప్రాంతాల్లో సంచరించిన ఈ జీవి ఎలా అంతరించిపోయింది? మళ్లీ భూమిపైకి తీసుకురావడం సాధ్యమేనా? ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.





