రాత్రిపూట ఇడ్లీ పిండి సిద్ధం చేసుకుని ఉంచుకోండి. ఉదయాన్నే ఇడ్లీ వేసి త్వరగా పిల్లలకు పెట్టొచ్చు. కాబట్టి రాత్రి పిండిని రెడీ చేసుకోండి. ఇడ్లీ పిండి లాగే దోశ పిండి కూడా రాత్రి కలిపి ఉంచుకుంటే ఉదయం త్వరగా దోశలు వేసి పెట్టవచ్చు.. రాత్రి పూరి లేదా చపాతీకి పిండి కలుపుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని ఉదయాన్నే పూరి లేదా చపాతిని వేడివేడిగా చేసుకుని తినొచ్చు. ఓట్స్‌లో పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి రాత్రి ఫ్రిజ్‌లో పెట్టి ఉదయాన్నే తింటే మంచి ఎనర్జీ వస్తుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు. పండ్లను కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఉదయాన్నే ఫ్రూట్ సలాడ్‌లా సులువుగా చేసుకోవచ్చు. పెసరట్టు పిండిని రాత్రి రెడీ చేసుకుని ఉదయం వేడివేడిగా పెసరట్లు వేసుకుని తింటే బాగుంటుంది. త్వరగా అయిపోతుంది. రాత్రి ఉప్మాకు కావాల్సిన కూరగాయలను కట్ చేసుకోండి. అలాగే రవ్వను వేయించి పెట్టుకోండి. ఉదయం తొందరగా చేసుకోవచ్చు. రాత్రి శాండ్‌విచ్‌కు కావాల్సిన కూరగాయలు, ఫిల్లింగ్ సిద్ధం చేసుకుని ఉదయాన్నే శాండ్‌విచ్‌ని ఫాస్ట్‌గా చేసుకుని తినేయొచ్చు. రాత్రి పాలు లేదా పెరుగులో చియా సీడ్స్‌ని నానబెట్టి ఉదయాన్నే తింటే పోషకాలు బాగా అందుతాయి.





