

Sudheer – Srishti : బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సంవత్సరం లవ్ ట్రాక్ లు కూడా నడుస్తాయి. ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో లవ్ ట్రాక్ ఇంకా మొదలవ్వకపోయినా సుధీర్ అయితే మొదలుపెట్టాడు. సృష్టితో సుధీర్ లవ్ ట్రాక్ మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ రోజు సుధీర్ స్వయంగా వచ్చి త్రిగున్ తో సృష్టి, నేను హైట్ సరిపోతామా, మా వైబ్ ఎలా ఉంది, మేము సెట్ అవుతామా.. అంటూ పలు ప్రశ్నలు అడిగి త్రిగున్ ని హెల్ప్ కూడా చేయమన్నాడు. త్రిగున్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారు సపోర్ట్ చేస్తా అన్నాడు.
అయితే మొదట్నుంచి రోహిత్ అగ్నిపరీక్ష టీమ్ ని కూడగట్టుకొని గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ బ్యాచ్ ని సెలబ్రిటీలతో కలవనివ్వట్లేదు. అలా కలిసినందుకు ఝాన్సీని నిన్న నామినేట్ చేసాడు. అగ్నిపరీక్ష బ్యాచ్ వాళ్ళు కలవకపోవడంతో సెలబ్రిటీలు కూడా గ్రూప్ గానే ఉన్నారు. కానీ ఇందులో సుధీర్ అగ్నిపరీక్ష బ్యాచ్ సృష్టితో పులిహార కలపడానికి ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిగున్ సపోర్ట్ తీసుకొని, త్రిగున్ తో ఉంటూ సడెన్ గా నిన్న సుధీర్ నామినేషన్స్ లో త్రిగున్ ని నామినేట్ చేసాడు. ఈ దెబ్బకు త్రిగున్ షాక్ అయ్యాడు.
Also Read : Bigg Boss Nominations : బిగ్ బాస్ 10 తెలుగు.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు?
దీంతో త్రిగున్ సుధీర్ ని నామినేట్ చేసాడు. సుధీర్ కట్టప్పగా మారినందుకు నామినేట్ చేసాను అన్నాడు. తన మంచి కోసం చెప్పిన మాటలను తన గేమ్ కోసం వాడినందుకు సుధీర్ ని నామినేట్ చేశాను అన్నాడు. ఈ విషయంలో సుధీర్ – త్రిగున్ గొడవ పడ్డారు. సుధీర్ నిన్న అంతా నామినేషన్స్ లో సృష్టికి సపోర్ట్ గా మాట్లాడుతూ వచ్చాడు. దీంతో సుధీర్ సృష్టి మెప్పు పొందడానికే త్రిగున్ కి వ్యతిరేకంగా తయారయ్యాడని తెలుస్తుంది. త్రిగున్ సుధీర్ కి ముందే చెప్పాడు సృష్టిని నిన్ను మార్చడానికి అగ్నిపరీక్ష బ్యాచ్ పంపిస్తుంది అని. అది అర్ధం చేసుకోకుండా సుధీర్ సృష్టి ని మెప్పించడానికి ఆమెకు సపోర్ట్ చేసి, ఇన్నాళ్లు సపోర్ట్ చేసిన త్రిగున్ కి వెన్నుపోటు పొడిచాడు. దీంతో త్రిగున్ చెప్పిందే జరుగుతుందని తెలుస్తుంది.
ఇక అగ్నిపరీక్ష బ్యాచ్ లో ఝాన్సీ మాత్రం ముందు నుంచి ఆ టీమ్ కి దూరంగా ఉంటూ సెలబ్రిటీలకు దగ్గరగా ఉండటంతో కొంతమంది సోషల్ మీడియాలో ఆమెని కట్టప్ప అని అన్నారు. కానీ ఆమె మొదటి రోజు నుంచి ఒకేలా ఉంది. సుధీర్ మాత్రం మొదటి రోజు నుంచి సెలబ్రటీటీల వైపు ఉండి, త్రిగున్ తో మంచిగా ఉండి సడెన్ గా సృష్టి కోసం త్రిగున్ ని తప్పు పట్టి నామినేట్ చేయడంతో అందరూ సుధీర్ ని కట్టప్ప అని అంటున్నారు. ఇప్పుడు కట్టప్పగా మారిన సుధీర్ చివరకు సృష్టి, అగ్నిపరీక్ష బ్యాచ్ చేతిలో మోసపోకుండా ఉంటే చాలు.




