
నాకు ఓ ఐడియా వచ్చింది.. నాకు పర్మిషన్ ఇస్తే.. ఓ పెగ్గు వేసి.. రచ్చ చేసి.. ఎంగేజ్మెంట్ ఆపేస్తా అని నారాయణ అంటాడు. పెగ్గు వద్దు కానీ.. తాగినట్టు నటించి.. ఈ ఎంగేజ్మెంట్ ఆపు అని మహా అంటుంది. కానీ నారాయణ పక్కకెళ్లి ఓ పెగ్గు వేసి నానా రచ్చ చేసేందుకు రెడీ అవుతాడు. రేయ్ కొత్తం.. రేయ్ శిశు పాలుడా.. వంద తప్పులు చేసినోడా.. ఇటు రా రా అని అరుస్తూ ఉంటాడు. ఏంటి.. మర్యాద లేకుండా రా రా అని అంటున్నావ్ అని శశిపాల్ తండ్రి అంటాడు. అవును రా అలానే పిలుస్తా.. ఏం చేస్తావ్ అని నారాయణ అంటాడు. నేను ముందే చెప్పా.. వీళ్లు తాగుబోతులు.. ఈ సంబంధం వద్దు అని.. మీరు వినలేదు అని జయంతి తండ్రి అంటాడు. అబ్బా నాన్న నువ్వు ఊరుకో అని అంటాడు శశిపాల్. మీరు వద్దనుకునేది ఏంటి.. నేనే చెప్తున్నా.. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని నారాయణ అంటాడు. ఇక ఈ పూలు ఏంటి? ప్లాస్లిక్ పూలా.. కనీసం రియల్ పూలు కూడా పెట్టరా? నా కొడుకు పెళ్లి మీకు అంత చీప్‌గా ఉందా? అని నారాయణ అంటాడు. ఇదంతా చూసి జయంతి తంత్రికి పిచ్చెక్కుతూ ఉంటుంది. నాన్నా.. నువ్వు ముందు లోపలకు వెళ్లు అని అతడ్ని పంపిస్తాడు శశిపాల్. ఇక ఇదంతా చాటుగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కేశవ, కన్నా, మహా. ఎంగేజ్మెంట్ ఆపేలానే ఉన్నాడు.. మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందని సంబర పడుతుంటారు. సుపుత్ర ఇంకా ఇలానే చెయ్యి.. డోస్ పెంచు అని మహా ఎంకరేజ్ చేస్తుంటుంది. అలాగే అలాగే అని నారాయణ అంటాడు. ఏంటి అలాగే అలాగే అని శశి పాల్ అడుగుతాడు. అలాగే కాదు.. ఇలాగేనా? చూసుకునేది ఇలాగేనా? మర్యాదలు ఇవేనా? అని కవర్ చేస్తాడు నారాయణ. మీకు ఇప్పుడు ఏం కావాలి అని అడుగుతాడు శశిపాల్. ఇక్కడేమీ లేవు అని నారాయణ అంటాడు. నా కొడుకు ఎంగేజ్మెంట్లో కనీసం నాకు మర్యాద లేదు.. మందు లేదు.. మటన్ లేదు అని నారాయణ అంటాడు. మీకు ఇప్పుడేం కావాలి మందే కదా.. పదండి అని శిశు పాల్ లోపలకు తీసుకు వెళ్తాడు. ఇక అక్కడ రూంలో మందు దుకాణాన్నే చూపిస్తాడు. దీంతో నారాయణ కూల్ అవుతాడు. మీకు కావాల్సినంత తాగండి.. అని అంటాడు శశిపాల్. వీడేంటి మందు అడిగితే.. ఫ్యాక్టరీనే చూపించాడు.. అంటే ఈ ప్లాన్ కూడా పోయినట్టేనా? అని నారాయణ తనలో తాను అనుకుంటాడు. ఇక ఇదే విషయాన్ని అక్కడకు వెళ్లి వాళ్లతో చెప్తాడు. మన సుపుత్రుడు వస్తున్నాడు.. మన ప్లాన్ సక్సెస్ అయిందా? అని మహా అడుగుతుంది. మన ప్లాన్ ఫ్లాప్ అయింది అని నారాయణ డల్‌గా చెప్తాడు. ఇక ఇంతలో అటు వైపుగా పెద్ది వస్తాడు. అసలు మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదు అని తలా ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటారు. దీంతో పెద్దికి అనుమానం వస్తుంది. అందరూ తలా ఒక దిక్కుకి వెళ్లిపోతారు. ఇక పంతులు ఇంకో వైపు ఇద్దరి జాతకాలు పట్టుకుని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా ఏంటి? అని జయంతి అడుగుతుంది. మొదటి పెళ్లి జరిగినప్పుడు జాతకాలు సరిగ్గా చూడలేదు.. కనీసం ఇప్పుడైనా చూడనివ్వండి అని ఆ పంతులు అంటాడు. జాతకాలు దివ్యంగా, అద్భుతంగా ఉన్నాయి.. ఇద్దరూ కలిసే తరతరాలు వర్ధిల్లుతాయి అని చెప్తాడు. ఆ మాటలకు కన్నా, కేశవ షాక్ అవుతాడు. ఇక ఎవ్వరికీ ఏ అనుమానాలు లేవు కదా అని పెద్ది అంటాడు. నా భార్యకి పెళ్లి.. జరుగుతోంది మళ్లీ అని శేఖర్ అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదేంటి పంతులు అని కన్నా, కేశవ అడిగితే.. అబద్దం చెప్పలేను బాబు అని తప్పించుకుంటాడు. రేయ్ కన్నా, కేశవ మిమ్మల్ని బావ పిలుస్తున్నాడు.. కోపంగా ఉన్నాడు.. ఏం వెదవ పనులు చేశార్రా అని గాయత్రి పిలుస్తుంది. కోపంగా ఉన్నాడా? తెలిసిపోయిందా? అని కన్నా, కేశవ కంగారు పడుతూ వస్తారు. అందరూ ఏం చేస్తున్నారో చూస్తున్నా అని పెద్ది అంటాడు. అవును.. చేస్తున్నాం.. మాకు ఇదంతా నచ్చడం లేదు.. ఈ పెళ్లి ఎలాగైనా ఆపుతాం అని అంటాడు చక్రి. నువ్వు కూడా వీళ్లతో చేరిపోయావా? అని మహాని పెద్ది అడుగుతాడు. అవును పెద్ది.. నీ సుఖం, సంతోషం కోసం.. ఈ పెళ్లి జరిగితే అవేవీ నీ జీవితంలో ఉండవు అని మహా అంటుంది. శైలు మాటల్ని పట్టుకుని నువ్వు ఇలా చేస్తున్నావ్ అని నాకు తెలుసు అన్నయ్య అని కేశవ అంటాడు.దీంతో పెద్ది షాక్ అవుతాడు. అసలు దీనంతటికి కారణం వీడే అయి ఉంటాడు అని చక్రి మీద సీరియస్ అవుతాడు పెద్ది. అవును నేనే రెచ్చగొడుతున్నా అందరినీ.. ఈ పెళ్లి ఆపాలని ఫిక్స్ అయ్యా.. ఆపుతాను అని కొడతావా? తిడతావా? అని పెద్దితో చక్రి అంటాడు. ఈ ఇంట్లో వాళ్లే నాకు శత్రువులు అయ్యారు.. దయచేసి ఈ ఎంగేజ్మెంట్ని ఆపకండి అని రిక్వెస్ట్ చేసి వెళ్లిపోతాడు పెద్ది. అన్ని దారులు మూసుకుపోయాయి.. మనం ఇంకేం చేయలేమా? ఈ ఎంగేజ్‌మెంట్‌ను ఆపలేమా? అని చక్రి అనుకుంటూ ఉంటాడు. అన్ని ప్లాన్స్ బెడిసి కొడుతూనే ఉన్నాయి.. ఇంకా ఏం చేయాలి.. అసలు ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపాలి అని చక్రి, నారాయణ, కేశవ ఆలోచిస్తుంటారు. ఇంకా ఏమైనా ప్లాన్స్ చేస్తే మనల్ని అన్నయ్య కొట్టినా కొట్టేలా ఉన్నాడు అని కేశవ అంటాడు. అవును అని కన్నా అంటాడు. పెద్ది అందరిలోనూ మంచి చూస్తాడు.. అందుకే ఇలా చేస్తున్నాడు అని మహా అంటుంది. అంతటితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది.





