
బోనాల సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మరోసారి స్పందించారు.
© 2026 nimisham.in

బోనాల సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి నటి ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మరోసారి స్పందించారు.
ఇంటర్నెట్‌ డెస్క్: బోనాల సమయంలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి నటి ఫరియా అబ్దుల్లా (Faria abdullah) మరోసారి స్పందించారు. ఆమె తాజా చిత్రం ‘సిగ్మా’ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయం గురించి మాట్లాడారు. సోషల్‌ మీడియాలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. ‘‘ఇటీవల సోషల్‌ మీడియాలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అదే వేదికగా నేను కూడా ఆ వివాదంపై నా అభిప్రాయాన్ని తెలియజేశాను. అయితే, ఒక విషయం మాత్రం నన్ను వెంటాడింది. మనం 2026లో జీవిస్తున్నాం. కానీ, ఇంకా చాలామంది పాతకాలం వాళ్లలా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో కొందరి భావజాలం బాధించింది. నేనెప్పుడూ అభ్యుదయ భావాలతో ఆలోచిస్తాను. నా పద్ధతులు నచ్చిన వాళ్లు అనుసరిస్తారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. అందరి ఆలోచనలను నేను గౌరవిస్తాను’’ అని చెప్పారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల సందడిలో ఫరియా అబ్దుల్లా.. పోతురాజుతో కలిసి నృత్యం చేశారు. ఆమె ఈ పండగ చేసుకోవడంపై కొందరు మతం పేరుతో విమర్శించారు. వీటిని ఖండించిన ఫరియా సోషల్‌ మీడియా వేదికగా నాడు వీడియో విడుదల చేశారు. తాను అంతటా భగవంతుడిని చూస్తానని అన్నారు. ఇక, సిగ్మా విషయానికొస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు విజయ్‌ కుమారుడైన జాసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. గౌతమ్‌ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక (Rashmika) ప్రధానపాత్రలో సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి (MS Subbulakshmi) జీవిత కథ తెరకెక్కనుంది.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







