
ఆరోగ్యానికి మంచిదని కొంతమంది వంటకాల తయారీలో ఆలివ్ నూనెను వాడుతుంటారు. ఎన్నో పోషకాలు నిండి ఉండే ఈ నూనె.. వంటకాలకు రుచినీ అందిస్తుంది. అయితే దీన్ని వాడడమే కాదు.. సరైన రీతిలో భద్రపరచడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. ఆరోగ్యానికి మంచిదని కొంతమంది వంటకాల తయారీలో ఆలివ్ నూనెను వాడుతుంటారు. ఎన్నో పోషకాలు నిండి ఉండే ఈ నూనె.. వంటకాలకు రుచినీ అందిస్తుంది. అయితే దీన్ని వాడడమే కాదు.. సరైన రీతిలో భద్రపరచడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు. లేదంటే నూనె త్వరగా పాడైపోయి అదో రకమైన వాసన వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. మరి, ఆలివ్‌ నూనె ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి.. ⚛ తాజా ఆలివ్‌ నూనె కమ్మటి వాసన వస్తుంది. ఈ వాసన మారినట్లయితే అది పాడైపోయినట్లుగా గుర్తించాలట. ⚛ తాజా ఆలివ్‌ ఆయిల్‌ రుచికి ఘాటుగా ఉంటుంది. అదే పాడైపోయిన నూనె అయితే.. పులిసిపోయిన రుచిని కలిగి ఉంటుంది.. పుల్లటి వాసన కూడా వెలువడడం గమనించచ్చు. ⚛ ఈ క్రమంలో ఈ నూనె గడువు తేదీకి సంబంధించి ప్యాకెట్/బాటిల్ లేబుల్‌పై ఉన్న విషయాలను కొనేముందు క్షుణ్ణంగా పరిశీలించాలంటున్నారు నిపుణులు. అయితే ఆలివ్‌ నూనెను భద్రపరిచే క్రమంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఈ నూనె త్వరగా పాడైపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు. ⚛ ఎండ తగిలినా, లైట్ల వెలుతురు ఈ నూనె బాటిల్‌/ప్యాకెట్‌పై పడినా.. ఆక్సిడేషన్‌ ప్రక్రియ జరిగి ఈ నూనె తాజాదనాన్ని కోల్పోతుందంటున్నారు నిపుణులు. కాబట్టి చీకటి ప్రదేశాల్లో, వెలుతురును నిరోధించే ముదురు రంగు బాటిల్స్‌లో ఈ నూనెను భద్రపరచడం మంచిదంటున్నారు. ⚛ అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కూడా ఆలివ్‌ నూనె తాజాదనాన్ని కోల్పోతుందట. అందుకే దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద వేడి ఎక్కువగా తగలని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. ⚛ ఈ నూనెకు గాలి తగిలితే ఇందులో ఆమ్ల స్థాయులు పెరిగిపోతాయట! ఇది నూనె త్వరగా పాడయ్యేందుకు కారణమవుతుందని, అందుకే ఆలివ్‌ నూనెను గాలి చొరబడని డబ్బాల్లో నిల్వ ఉంచాలంటున్నారు నిపుణులు. ⚛ డార్క్‌ గ్లాస్‌, సెరామిక్‌, స్టీల్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారుచేసిన కంటెయినర్స్‌లో ఈ నూనెను ఉంచడం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగే ప్లాస్టిక్‌ డబ్బాల్లో దీన్ని నిల్వ చేయకపోవడమే మంచిదంటున్నారు. ఎందుకంటే ప్లాస్టిక్‌లోని కొన్ని పదార్థాలు నూనె తాజాదనాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. For Editorial Feedback eMail: For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in © 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd, . Powered By Margadarsi Computers





