
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్ చేసే విధానంలో మార్పులు చేసింది. ఆదివారం రెవెన్యూ శాఖ ఈ మేరకు తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు(జీఓ 584) జారీ చేశారు.





