
ద ర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ బాలీవుడ్‌ చిత్ర దర్శకుడితో కలిసి కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన.. ‘సైయారా’ చిత్రంతో హిందీ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న మోహిత్‌ సూరితో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ‘‘నేను, మోహిత్‌సూరి.. తదుపరి చిత్రం కోసం ‘గ్యాంగ్‌స్టర్‌ కర్రీ’ రుచులతో కూడిన ఒక ‘లవ్‌ డిష్‌’ని సిద్ధం చేస్తున్నాం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే మీ ముందుకు రానున్నాయి’’అనే క్యాప్షన్‌ని పేర్కొన్నారు. ఇటీవలే రామ్‌ గోపాల్‌వర్మ ‘పోలీస్‌ కంపెనీ’ చిత్రాన్ని ప్రకటించారు. మోహిత్‌ సూరి ఈ ఏడాది చివర్లో ఓ రొమాంటిక్‌ డ్రామా సినిమా కోసం మరోసారి ‘సైయారా’ ఫేమ్‌ హీరో అహాన్‌ పాండే, అనీత్‌ పడ్డాలతో కలిసి పనిచేయనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





