
బా లీవుడ్‌ దర్శకురాలు అనుపర్ణ రాయ్‌ తను తెరకెక్కించిన ‘లవర్స్‌ ఇన్‌ ది బ్లూ నైట్‌’కు గానూ వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ ఆసియా చిత్రంగా నెట్‌ప్యాక్‌ అవార్డుని గెలుచుకున్నారు. గతేడాది ఆమె తొలి ఫీచర్‌ ‘సాంగ్స్‌ ఆఫ్‌ ఫర్గాటెన్‌ ట్రీస్‌’ చిత్రానికి ఒరిజోంటి విభాగంలో ఉత్తమ దర్శకురాలిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడదే విభాగంలో అనుపర్ణ దర్శకత్వం వహించిన రెండో చిత్రం వెనిస్‌ చిత్రోత్సవంలో ప్రదర్శితమై మరోసారి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ‘ఫాలింగ్‌ హౌస్‌’, ‘వాట్‌ బిలాంగ్‌ టు అదర్స్‌’ లాంటి పలు చిత్రాలతో పోటీపడింది. కాస్‌ కుమార్, షరీబ్‌ ఖాన్‌ తదితరులు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నీలిమ శర్మ, ప్రీతమ్, కాజల్‌ కేశవ్, జతిన్‌ నటించారు. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాలో.. ‘‘ఇది కలో, నిజమో తెలియట్లేదు. ఈ చిత్ర ప్రదర్శన అనంతరం ఏడు నిమిషాల పాటు స్టాండింగ్‌ ఒవేషన్‌ చేశారు. నాకు, నా బృందానికి జీవితకాలం గుర్తుండే క్షణమిది. కలలు కనడం, కథలు చెప్పడం, గుర్తింపు పొందడానికి మనం ఎందుకు సృష్టించదగినవారమో నాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్‌ వెనిస్‌’’అని పంచుకున్నారు. సమాజపు అంచులకు నెట్టేసిన జీవితాలను లోతుగా పరిశీలించి, వారిలోని మానవత్వాన్ని గుర్తించమని తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపొందినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





