
‘‘ప్ర పంచంలోని తెలుగు వాళ్లంతా కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌తో రూపొందించిన సినిమా ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’’ అన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్‌. ఆయన ప్రధాన పాత్రధారిగా నటించిన ఈ చిత్రాన్ని మహేశ చంద్ర తెరకెక్కించారు. దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్‌ పటేల్, ఎఫ్‌ఎం మురళి నిర్మించారు. పృథ్వీరాజ్, కేదార్‌ శంకర్, మణిచందన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ద్వారా ఈ నెల 18న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సుమన్‌ టీజర్‌ విడుదల చేశారు. అనంతరం నటుడు రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది అందరి ఇళ్లలో ఉండే కథతో రూపొందిన సినిమా. ఈ చిత్ర క్లైమాక్స్‌ సన్నివేశంలో ఆర్టిస్ట్‌లు కూడా కన్నీరు పెట్టుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, వీర శంకర్, ప్రసన్న కుమార్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



