
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి ప్రతిమలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వివిధ రకాల పదార్థాలతో సృజనాత్మకంగా రూపొందించిన ఈ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కాకినాడ(kakinada) నగరంలోని జగన్నాథపురంలో 500 కిలోల జీడిపప్పుతో చేసిన వినాయకుడు; పెద్ద మార్కెట్‌లోని సాయిబాబా ఆలయం వద్ద 200 కిలోల డ్రై కివీ పండ్లతో దాదాపు 18 అడుగుల ఎత్తైన వినాయక ప్రతిమలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. కర్నూలు(kurnool) నగరం పాత బస్టాండులో 25 అడుగుల కాలుష్య రహిత మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. మించన్ బజార్‌లో వినూత్నంగా గణేశుడిని స్త్రీ రూపంలో అలంకరించారు. విశాఖపట్నం(Visakhapatnam)లో అగ్నిమాపక అధికారిగా, రాజాసాబ్ సినిమా తరహాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరబాబు అనే వ్యక్తి అక్షింతలతో ఆరున్నర అడుగుల వినాయక విగ్రహాన్ని రూపొందించారు. ఈ వార్త చదివారా: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 892 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు




