
ఉసిరికాయల్లోని విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు తెల్ల జుట్టు రాకుండా కాపాడుతాయి. దీనికోసం ప్రతిరోజూ ఉసిరి తినడం లేదా ఉసిరి జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి.
జుట్టుకు నల్ల రంగు అందించే పిగ్మెంట్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు సహాయపడుతుంది. దీనికోసం మీ ఆహారంలో కరివేపాకు ఎక్కువగా చేర్చుకోండి. అలాగే మీరు ఉపయోగించే నూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడి వేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
జుట్టుకు నలుపు రంగు ఇచ్చే మెలనిన్ ఉత్పత్తికి ఐరన్ కాపర్ చాలా అవసరం. ఈ పోషకాలు నల్ల నువ్వుల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెల్ల జుట్టు నివారణకు రోజూ ఒక స్పూన్ నల్ల నువ్వులు తీసుకోండి.
తెల్ల జుట్టు తొందరగా రావడానికి విటమిన్ బి6, బి12 లోపం కూడా ఓ కారణం. అందుకే ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే అరటి పండు, పాల పదార్థాలు, కోడిగుడ్లు ఎక్కవగా తీసుకోండి. ఇవి తెల్ల జుట్టు రాకను ఆలస్యం చేస్తాయి.
నల్లటి జుట్టు కోసం కాపర్ చాలా అవసరం. అందుకోసం ఈ కాపర్ ఎక్కువగా లభించే బాదం, జీడిపప్పు, శనగలు వంటివి ఎక్కువగా తీసుకోండి.
కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపర్చి తెల్ల జుట్టు రాకుండా కాపాడటంలో ఆయిల్ మసాజ్ సహాయపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనెలో భృంగరాజ్ ఆకులు వేసి మరిగించి తలకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేయండి.
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి ఒత్తిడి ప్రధాన కారణం. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోండి. దీనికోసం ప్రతిరోజూ కాసేపు ధ్యానం, యేగా చేయండి.
స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా తాగితే శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి పెరిగి తెల్ల జుట్టు వస్తుంది. అందుకే ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి.
జుట్టుకు కెమికల్స్ ఎక్కువగా ఉండే ప్రోడక్టులు వాడకండి. ముఖ్యంగా సల్ఫేట్ ఫ్రీ షాంపూ, కండిషనర్ వాడడం మంచిది.




