
Nara Lokesh visited Tirumala : సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో కలిసి మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు స్థానిక నేతలు స్వాగతం పలికారు. ఆ తరువాత సింగపూర్ హోం మంత్రితో కలిసి నారా లోకేశ్ తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగానాయకుల మంటపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి శేషవస్త్రం, తీర్థప్





