
FMCG Bonus Issue: స్మాల్ క్యాప్ కేటగిరిలోని వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీ మయాంక్ క్యాటిల్ ఫుడ్ లిమిటెడ్ (Mayank Cattle Food Limited) సూపర్ ఆఫర్ తెచ్చింది. ఈ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తమ షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లు జారీ చేయాలని నిర్ణయించారు. తాజాగా ఈ బోనస్ షేర్లకు రికార్డు డేట్ నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఆగష్టు 24ను రికార్డ్ తేదీగా ఎంచుకున్నట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం 1 షేరు కొంటే బోనస్ గా మరొక షేరు లభిస్తుంది. దీని అర్థం మీ వద్ద 100 షేర్లు ఉంటే మరో 100 షేర్లు, 1000 షేర్లు ఉంటే మరో 1000 షేర్లు ఉచితంగా లభిస్తాయి.మరోవైపు ఈ కంపెనీ షేర్ గత 2 ఏళ్లలో 99 శాతం లాభాన్ని అందించింది. ఇన్వెస్టర్ల పెట్టుబడిని దాదాపు రెండింతలు చేసింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. కొద్ది రోజుల క్రితం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరును కొని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్నవారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరును బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు.ఇక తాజాగా ఈ బోనస్ షేర్లను పొందడానికి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు డేట్ ఆగష్టు 24, 2026గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది.స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో మయాంక్ క్యాటిల్ ఫుడ్ షేరు 2.29 శాతం లాభంతో రూ. 221 వద్ద ముగిసింది. ఈరోజు ఆగస్టు 12వ తేదీ ట్రేడింగ్లో 3.14 శాతం లాభంతో రూ.227.85 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 235.80 వద్ద ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 144.25 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 6 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 1 శాతం నష్టపోయింది. గత ఆరు నెలల్లో 42 శాతం లాభాన్ని అందించింది. గత ఏడాది కాలంలో 3 శాతం లాభపడింది. గత రెండేళ్ల కారంలో ఈ స్టాక్ 99 శాతం పెరిగింది. లక్ష పెట్టిన వారికి దాదాపు రూ.2 లక్ష వరకు అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 123 కోట్ల వద్ద ఉంది.
Found this helpful?
Share this story with your network





