Sunshine Pictures IPO : ప్రముఖ ఫిల్మ్ అండ్ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా (Vipul Shah) ప్రమోట్ చేస్తున్న సన్‌షైన్ పిక్చర్స్ (Sunshine Pictures) పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. రూ.282 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో ఆగస్టు 18, 2026 మంగళవారం ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. బిడ్డింగ్ ప్రారంభమైన కేవలం 90 నిమిషాల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి రికార్డ్ సృష్టించింది. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు (Retail Investors) ఈ ఐపీఓలో షేర్ల కొనుగోలుకు విపరీతంగా పోటీపడ్డారు. సన్‌షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు వచ్చిన తొలి 90 నిమిషాల వ్యవధిలోనే బిడ్డింగ్ పూర్తయింది. ఎన్ఎస్ఈలోని డేటా ప్రకారం 54.59 లక్షల షేర్లకు గానూ గంటన్నరలోనే 54.86 లక్షల బిడ్లు దాఖలయ్యాయి. రిటెయిల్ కోటా 1.49 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 1.16 రెట్ల మేర సబ్స్క్రిప్షన్ పొందింది. ఈ కంపెనీ ఇప్పటికే యాంకర్ మదుపరుల నుంచి రూ.84.64 కోట్ల నిధులను సమీకరించింది.షేరు ధరలు ఇలాసన్షైన్ పిక్చర్స్ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 18వ తేదీన మొదలై ఆగస్టు 20వ తేదీ వరకు కొనసాగనుంది. ఒక్కో షేరు ధర రూ.342 నుంచి రూ.360గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద రూ.282 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా ఐపీఓకు వచ్చింది. ఈ ఐపీఓ ద్వారా 48 లక్షల ఫ్రెష్ షేర్లు, 30.37 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయిస్తున్నారు. విపుల్ అమృతలాల్ షా, షెఫాలీ విపుల్ షా ప్రమోటర్లుగా తమ వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయిస్తున్నారు. ఈ కంపెనీ షేర్లు ఆగస్టు 25, 2026న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి.Read Also: ఎట్టకేలకు లలితా జువెల్లరీ ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 1700 కోట్లు.. ఒక్కో షేరు ధర ఎంతో తెలుసా?కనీసం 41 షేర్లు (ఒక్కో లాట్ విలువ సుమారు రూ.14,760) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రూ.172.80 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.109.34 కోట్లు విలువైన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీఓలో షేర్లు దక్కించుకున్న వారికి ఆగస్టు 21న అలాట్మెంట్ ఉంటుంది.అదరగొట్టిన మిల్కీ మిస్ట్డెయిరీ ఉత్పత్తుల సంస్థ మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ కంపెనీ ఐపీఓ అదరగొట్టింది. మంగళవారం 18 శాతం ప్రీమియంతో మార్కెట్లలో లిస్టింగ్ అయింది. ఇష్యూ ధర రూ.140 గా ఉండగా దాదాపు 18 శాతం లాభంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో రూ.165 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఒక దశలో 29.60 శాతం పెరిగి రూ.181.45 వద్ద గరిష్ఠాన్ని తాకాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,968 కోట్లకు చేరింది.