
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇతర మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సూచీలు నష్టపోయాయి. దీంతో నిఫ్టీ వరుసగా ఏడో రోజూ నష్టాల్లో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 77,218.05 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,235.46) వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లో కొనసాగిన సూచీ.. ఓ దశలో 76,822.89 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 325.78 పాయింట్ల నష్టంతో 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్ల నష్టంతో 24,078 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91 డాలర్ల స్థాయికి చేరగా.. బంగారం ఔన్సు ధర 4,368 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Share this story
Help others stay updated with verified breaking news and insights.