
వెల్దుర్తి: జర్నలిస్టులపై దాడులు జరగకుండా చూడాలని వెల్దుర్తి ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమవారం వడ్డగేరిలో కొలువైన గణనాథుడికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలని వినాయకుడిని వేడుకున్నారు. యూనియన్ నాయకులు ఓమేంద్ర, రాజశేఖర్, అశోక్, నజీర్ తదితరులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




