
ఆళ్లగడ్డ గ్రామీణ: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 44వ పీఠాధిపతి వేదాంత దేశిక యతీంద్ర మహాదేశికన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని, 44 పీఠాధిపతి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ ముఖద్వారం మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించారు. పీఠాధిపతిని పల్లకిపై కొలువు తీర్చి ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని దేవతామూర్తుల సన్నిధి వద్దకు తీసుకెళ్లి మంగళ శాసనం చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






