
దశరథ.. కాలర్ పట్టుకుని శివన్నారాయణని పక్కకి నెట్టేస్తాడు. ముసలోడు పడిపోతుంటే.. కరెక్ట్ టైమ్‌కి వచ్చి మాలిని పట్టుకుంటుంది. ఛీ ఛీ అనుకుంటాడు శివన్నారాయణ. ‘చూశావా? నిన్నటి వరకూ నీ కింద ఉన్న వాళ్లే.. ఇప్పుడు నెట్టేశారు.. ఇక్కడ కాసేపు ఉంటే కొడతారేమో.. నీ పని అయిపోయిందిలే బాబాయ్.. ఆరోజు నేను ఓడిపోయి నిన్ను గెలిపించిందీ.. ఈరోజు కోసమే. మన గెలుపు ఎలా ఉండాలంటే.. శత్రువు నిలబడటానికి నీడ కూడా ఉండకూడదు’ అని అంటుంది మాలిని. ఇంతలో దశరథ వచ్చి.. పద నాన్నా వెళ్దాం అంటూ శివన్నారాయణని తీసుకుని వెళ్లిపోతాడు దశరథ. సినిమా అప్పుడే అయిపోలేదు బాబాయ్.. ఇంటి దగ్గర నీకో బంపరాఫర్ ఉంచా వెళ్లు.. దాంతో నీకు దిమ్మతిరిగిపోద్ది.. ఈ మాలిని కొట్టే చావు దెబ్బ ఇదే’ అని అనుకుంటుంది మాలిని. కట్ చేస్తే.. శివన్నారాయణ ఇంట్లోకి వెళ్లకుండానే.. లోన్ రికవరీ కోసం బ్యాంక్ వాళ్లు వచ్చారంటూ పరుగు పరుగున బయటకు వస్తుంది సుమిత్ర. చెప్తే వాళ్ల సంగతి పదా అంటూ ఆవేశంగా వెళ్తాడు శివన్నారాయణ. ఈ వయసులో అంత ఆవేశం మంచిది కాదు కానీ.. మా దగ్గర మేడమ్‌గారు రూ.20 కోట్లు అప్పు తీసుకున్నారు.. ఆవిడ కట్టకపోతే మీరే కట్టాలి’ అని అంటారు బ్యాంక్ వాళ్లు. ఏ మేడమ్ గారూ అని దశరథ అడగడంతో.. మాలిని మేడమ్ అని అంటాడు బ్యాంక్ మేనేజర్. ఆవిడ అప్పు చేస్తే నేనెందుకు కట్టాలి? అని అంటాడు శివన్నారాయణ. ఎందుకంటే షూరిటీ సంతకం పెట్టింది మీరే కాబట్టి అంటూ ఫైల్స్ చూపిస్తారు. దాంతో ముసలోడికి దిమ్మతిరిగిపోద్ది. మీకు ఈ ఇల్లు తప్ప ఏ ప్రాపర్టీ మీ కంట్రోల్లో లేదు.. అవి ఆల్రెడీ వేరే వాళ్లు హ్యాండోవర్ చేసుకున్నారు. మీరు ఇప్పటికిప్పుడు రూ.20 కోట్లు కట్టాలి.. లేదంటే ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుంది. మీకు నోటీసులు ఇచ్చాం.. మీరు స్పందించలేదు. మీరు ఇక చేసేది ఏం లేదు.. కట్టు బట్టలతో ఇల్లు వదిలి వెళ్లాల్సిందే అని అంటారు బ్యాంక్ వాళ్లు. ఇక ఇంట్లో ఉన్న బంగారం, నగల్ని మొత్తం స్వాధీనం చేసుకుంటారు బ్యాంక్ వాళ్లు. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందీ.. ఇదంతా తనకి తెలిస్తే తట్టుకోలేదు అని అంటాడు శివన్నారాయణ. ఇంతలో బ్యాంక్ వాళ్లు.. ఇవన్నీ లెక్కకట్టినా కూడా బాకీ సరిపోవడం లేదు. ఒంటిపై ఉన్న నగలతో పాటు. మీ డెబిట్ కార్డ్‌లు క్రెడిట్ కార్డులు, మొబైల్స్ కూడా ఇక్కడ పెట్టండి అంటూ మొత్తం ఒంటిపై ఉన్న వన్నీ లాక్కుంటారు బ్యాంక్ వాళ్లు. అనంతరం మీరు ఇక ఈ ఇంట్లో నుంచి వెళ్లొచ్చు.. మాలిని మేడమ్ గారు వచ్చే వరకూ మేం ఇక్కడే ఉంటాం అని అంటారు బ్యాంక్ వాళ్లు. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తాం అని పారిజాతం అంటే.. ఇక్కడ ఉండాలంటే బ్యాంక్ లోన్ క్లియర్ చేయాలి.. ఒక్క వస్తువు కూడా తీసుకుని వెళ్లడానికి వీళ్లేదు. కట్టు బట్టలతోనే వెళ్లాలి అని అంటారు బ్యాంక్ వాళ్లు. ఎక్కడికి వెళ్తాం అని పారిజాతం కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ‘నమ్మకం చాలా ఖరీదైనది పారిజాతం.. అందుకే ఈ శిక్ష.. సంతకం పెట్టాం.. సర్వం పోగొట్టుకున్నాం’ అని అంటాడు శివన్నారాయణ. వీడికి ఉన్న గోచీ పీకేసినా కూడా వేదాంతం వదల్లేదు అన్నట్టుగా ఉంటాయి శివన్నారాయణ మాటలు. ఇక శివన్నారాయణని బయటకు గెంటేస్తారు బ్యాంక్ వాళ్లు. కార్లు కూడా లాగేసుకుంటారు. లోపల దీప కొనఊపిరితో ఉంటే.. బయట జ్యోత్స్న, సూరజ్‌లు తగువులాడతారు. నాతో పాటు నువ్వు దీపని కూడా మోసం చేశావ్.. అని అంటుంది జ్యోత్స్న. ‘నువ్వు ఏమనుకున్నా.. దీప నా వదిన. రుణం తీర్చుకోవడం నా బాధ్యత’ అని అంటాడు సూరజ్. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? దీపని హాస్పిటల్‌కి తీసుకుని రావడం వెనుక ఏదో ప్లాన్ ఉండి ఉంటుందని అనుకున్నానే.. ఏ ప్లాన్ లేకపోతే నువ్వే మా బావకి డైరెక్ట్‌గా ఫోన్ చేయొచ్చు కదా.. ఈరోజు ఎందుకు దీపని కాపాడావు? దీప సేవ్ అయితే దీప కడుపులో బిడ్డ సేవ్ అయినట్టే. రెండు ప్రాణాలను ఎందుకు కాపాడాలని అనుకున్నావ్? నువ్వు వాళ్లని నమ్మించి మోసం చేశావ్ కాబట్టే’ అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటతో సూరజ్.. ఇది తప్పు అనిపిస్తే మళ్లీ ఆ తప్పు చేయకు.. నేను అలాంటి తప్పు చేయను. కొన్నింటికి సమాధానాలు చెప్పడంలో కాదు.. అర్థం చేసుకోవడంలో ఉంటాయి.. నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వేం అనుకున్నా.. నేను చేసేది చేస్తాను. కార్తీక్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్లింది వస్తాడు.. ఇక నేను వెళ్తున్నా’ అని అంటాడు. నువ్వు వెళ్లి చాలా సేపైంది సూరజ్.. ఎప్పుడో వెళ్లిపోయావ్. ఇప్పుడు కొత్తగా వెళ్తానని చెప్పాల్సిన పని లేదు. కంటికి కనిపిస్తేనే మనిషి ఉన్నట్టు కాదు. అలాగని కనపడని వాళ్లంతా మనతో లేనట్టు కాదు. ఏం చెప్పకుండానే నా జీవితంలోకి వచ్చావ్.. ఏం చెప్పకుండానే నన్ను వదిలి వెళ్లిపోయావ్. చెప్పాల్సిన టైమ్‌లో చెప్పకుండా.. అవసరం లేదనుకున్నప్పుడు చెప్పడం ఎందుకు? నువ్వు నా నుంచి ఏనాడో వెళ్లిపోయావ్’ అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో కంగారుగా హాస్పిటల్‌కి వస్తాడు కార్తీక్. జ్యోత్స్నని చూసి.. దీపకి ఏమైంది? అని అడుగుతాడు. ఆపరేషన్ జరుగుతుంది బావా.. కండిషన్ సీరియస్‌గా ఉంది అని అంటుంది జ్యోత్స్న. సీరియస్ అంటే ఏంటి? అంటూ కంగారు పడతాడు కార్తీక్. దీప బ్రతకపోవచ్చు బావా.. ఒకవేళ దీప బ్రతికినా కూడా కడుపులో బిడ్డ అంటూ గ్యాప్ ఇచ్చి వదులుతుంది జ్యోత్స్న. కార్తీక్‌కి విషయం అర్థం అవుతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ ఎలా అయ్యిందంటూ తలపట్టుకుంటాడు. నాకూ తెలియదు బావా.. నేను వెళ్లేటప్పటికే ఘోరం జరిగిపోయింది. కడుపుకి బలంగా దెబ్బ తగిలింది. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది బావా.. డాక్టర్ గారు బయటకు వస్తేనే కానీ ఏం చెప్పలేని పరిస్థితి అని అంటుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ అక్కడే కుప్పకూలిపోతాడు. నా దరిద్రం ఎలా తగలడిందో చూడు.. దీప ఎలా ఉందో ఏంటో అని కన్నీళ్లు పెట్టుకుంటాడు కార్తీక్. అంటు శివన్నారాయణ రోడ్డున పడ్డాడు.. ఇటు దీప హాస్పిటల్లో పడింది. మరి వీళ్ల పరిస్థితి ఏంటో తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.




