
బెంగళూరు: రైతుపై పులి దాడి చేసి హతమార్చిన ఘటన చామరాజనగర్ జిల్లా బడగరపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బడగరపల్లికి చెందిన బసవన్న (55) సోమవారం సాయంత్రం పంటపొలాన్ని చూడటానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. సమీప పొలాల్లో సగం భాగాన్ని తినేసిన స్థితిలో బసవన్న మృతదేహం లభ్యమైంది. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు సోమవారం ఆందోళన చేశారు. అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




