
Tata Chemicals Share Price Today: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్లో మళ్లీ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఆరంభంలో మంచి లాభాల్లోనే ట్రేడయినా కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అయినా ఇక్కడ టాటా గ్రూప్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ దిశగా అడుగులు పడటమే కారణంగా తెలుస్తోంది. దీంట్లో వాటాలు ఉన్న టాటా కంపెనీల విలువ పెరుగుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారు.
Found this helpful?
Share this story with your network