
© 2026 nimisham.in

KAAKA On Jan 13 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA). ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న అన్ని రకాల ఊహాగానాలకు చిత్ర యూనిట్ తాజాగా తెరదించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఘనవిజయం తర్వాత ఈ క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలాఉంటే, సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు. Putting all the speculation to rest, #KAAKA is releasing for Sankranthi 2027🔥 Our much anticipated film with Megastar @KChiruTweets Garu and @DirBobby will arrive in cinemas worldwide on JANUARY 13, 2027. First Single Soon🕺🎶 #KAAKAOnJan13 #KVNProductions pic.twitter.com/0vAHB4ZVPy — KVN Productions (@KvnProductions) September 17, 2026
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Help others stay updated with verified breaking news and insights.






