
Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ (Aakasam Lo Oka Tara). ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఫీల్ గుడ్ మూవీని నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న దుల్కర్ సల్మాన్.. “ఇప్పటివరకు ఈ ప్రయాణం చాలా అందంగా సాగింది. నవంబర్ 20న ఈ సరికొత్త ప్రపంచాన్ని మీ అందరికీ పరిచయం చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. ఇట్లు మీ కృష్ణ” అంటూ తన పాత్ర పేరుతో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో గ్లామరస్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా మరియు లైట్‌బాక్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. This one has been a lovely journey so far ❤️ Can’t wait to introduce you all to this world on November 20th 🤗 Yours, Krishna #AakasamLoOkaTara #AOTMovie #AOTonNOV20th @pavansadineni @GeethaArts @SwapnaCinema @Lightboxoffl @shrutihaasan @satveeravalli @gvprakash @grajug … pic.twitter.com/qEKUxFmcpV — Dulquer Salmaan (@dulQuer) September 17, 2026





