
దీంతో అయ్యో, అయ్యో, అయ్యో చేయకూడని పనులు చేయకూడదని నేను నెత్తినోరు మొత్తుకున్నా నా మాట వినలేదు కదా.. మీరు చేసిన పని వల్ల చనిపోయిన ఆవిడే మళ్లీ మన ఇంటికి తిరిగొచ్చిందని అరుస్తుంది భానుమతి. దెయ్యంరా ఇది దెయ్యంరా అంటుంది. దీంతో ఏం మాట్లాడుతున్నారు మీరంటూ లక్ష్మమ్మ సీరియస్ అవుతుంది. నేను చావడం ఏంటి, వీళ్లు నాకు పిండం పెట్టడం ఏంటని నిలదీస్తుంది. నేను దెయ్యం అయి రావడం ఏంటని అడగ్గా.. చచ్చిన మనిషి తిరిగొస్తే దెయ్యం కాక ఇంకేమంటారని భానుమతి అంటుంది. ఇదేమీ అర్థం కాని లక్ష్మమ్మ.. మీ వాళ్లు ఏం మాట్లాడుతున్నారు కమల్ అని అడుగుతుంది. మీరు చనిపోయారని, మా కమల్ చెప్పాడంటుంది పార్వతి. నేను చనిపోయానని నువ్వు చెప్పడం ఏంటి కమల్ అని లక్ష్మమ్మ నిలదీస్తుంది. మరోవైపు పల్లవి.. అక్కా మనిద్దరికి భయం అక్కా అంటుంది. దీంతో పార్వతి.. "రేయ్ మీరెవరూ మాట్లాడరేంట్రా, బతికున్న మనిషిని చనిపోయిందని ఎందుకు చెప్పార్రా, ఏం జరుగుతోందిరా" అని నిలదీస్తుంది. దీంతో అక్షయ్ అమ్మా అనగానే.. భానుమతి మీరు చెప్పింది అబద్ధం అని అర్థమైందిరా అంటుంది. అసలు చనిపోయింది ఎవరురా, అసలెవరికి పిండాలు పెట్టార్రా, చెప్పండి, చెప్పండ్రా అంటూ నిలదీస్తుంది. నానమ్మ అని శ్రీకర్ ఆగిపోగా.. పల్లవి మాత్రం మనసులో.. ఎవరూ తప్పించుకోలేరు మామయ్య చనిపోయారని చెప్పి తీరాల్సిందేనని అనుకుంటుంది. చెప్పండ్రా అని పార్వతి మరోసారి కేక వేయగా.. మేం చెప్పిందే అబద్ధం కాదని అవని చెబుతుంది. దీంతో మీరు చచ్చిందని చెబుతున్న ఆవిడే వచ్చి నేను బతికున్నానని చెబితే బుకాయిస్తున్నావేంటని భానుమతి అంటుంది. అవని మాత్రం.. బుకాయించడం కాదు అమ్మమ్మగారు, ఒక్క నిమిషం ఉండండి అంటుంది. ఈవిడ కమల్ ఫ్రెండ్ శ్రీరామ్ అమ్మగారే, కానీ చనిపోయింది శ్రీరామ్ అమ్మగారు కాదు, కమల్ ఫ్రెండ్ శ్రీరాజ్ అమ్మగారు అని చెబుతుంది. దీంతో కమల్ అవునని చెబుతాడు. అంతా ఊపిరి పీల్చుకుని అవనంటారు. అవని కూడా అవనత్తయ్యా.. సడెన్‌గా చనిపోవడంతో.. ఆ షాక్‌లో కమల్ శ్రీరాజ్ అని చెప్పబోయి శ్రీరామ్ అని చెప్పాడంటుంది. అవునమ్మా అని కమల్ సమర్థిస్తాడు. ఆంటీ శ్రీరాజ్ అమ్మగారు పోయారని, శ్రీరామ్ చెప్పలేదా అని అడుగుతాడు. దీంతో లక్ష్మమ్మ.. అసలు శ్రీరాజ్ ఎవరని అడుగుతుంది. దీంతో మళ్లీ కమల్ నోరెళ్లబెడతాడు. శ్రీరాజ్ కమల్‌కు ఫ్రెండ్ అయితే.. కమల్ ఫ్రెండ్ శ్రీరామ్‌కు కూడా శ్రీరాజ్ ఫ్రెండ్ అవుతాడు కదా అంటుంది అవని. మీ అబ్బాయి నాకు ఫ్రెండ్ అయినప్పుడు.. నా ఫ్రెండ్స్ కూడా మీ అబ్బాయికి తెల్సుండాలి కదా అంటాడు. దీంతో లక్ష్మమ్మ.. అవునవును అంటుంది. అంటే నా ఫ్రెండ్ శ్రీరాజ్ అమెరికా నుంచి ఉదయమే వచ్చాడంట, ఇప్పుడే మేం వాడి ఇంటికి వెళ్తున్నాం అని కమల్ చెబుతాడు. మీ అబ్బాయి శ్రీరామ్‌కు శ్రీరాజ్ ఫ్రెండ్ కాబట్టి.. మీరు కూడా వీళ్లతో వెళ్లి అతనొకసారి పరామర్శించండని అవని చెబుతుంది. పాపం శ్రీరాజ్ తల్లిగారు పోయారు.. మీలాంటి పెద్దవాళ్లు వెళ్లి ధైర్యం చెబితే బాగుంటుందండి అని వివరిస్తుంది. మీరు కూడా వెళ్లండి అంటూ చెప్పగానే.. అక్షయ్, శ్రీకర్, కమల్‌లు లక్ష్మమ్మను తీసుకుని బయటకు వెళ్తారు. దీంతో అవని, శ్రియాలు ఊపిరి పీల్చుకోగా.. పల్లవి మాత్రం తెగ ఫీల్ అయిపోతుంది. అసలు నిజం తెలియకుండా అవని చెడగొట్టిందని బాధ పడుతుంది. అసలీ సీన్ చూశాకా.. రేయ్ ఎవర్రా మీరంతా అనాలనిపించింది. హీరోయిన్ అవని.. ఇన్ని అబద్ధాలు చెప్పడం ఏంటో, అవన్నీ నమ్మడానికి వీళ్లేకుండా ఉన్నా పార్వతి, భానుమతిలు నమ్మడం ఏంటోనని అనిపిస్తోంది. ఎలాగూ చూస్తున్నారు కదా అని.. ప్రతీసారి తెల్సిపోబోతున్నట్లు చూపిస్తూ.. చివరకు హ్యాండిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. కొంచెం లాగితే పర్వాలేదు కానీ.. మరీ ఇంతగా సీరియల్‌ను లాగడం చూస్తుంటే.. ఇంకో నెలపాటు రాజేంద్ర ప్రసాద్ అంత్యక్రియలు, ఆ తర్వాతి కార్యక్రమాలు, పార్వతి, భానుమతిలకు తెల్సిపోబోతున్నట్లు చూపిస్తూ.. కాలం గడిపేస్తారనిపిస్తోంది. మరోవైపు మీనాక్షి కూరగాయలు కోస్తుంటే.. శ్రియా వచ్చి మాట్లాడుతుంది. పిన్నిగారు బాబుకు పప్పు, బియ్యం వేసి ఉగ్గు తయారు చేస్తాననన్నారు కదా అంటుంది. చేస్తానమ్మా, ఓ పది నిమిషాలని మీనాక్షి చెప్పగా.. ఇప్పుడే అక్కర్లేదు పిన్నీ, మీరు అన్నారనే నేను అడిగానంటుంది శ్రియా. దీంతో మీనాక్షి బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంది. ఆడుకుంటున్నాడని చెప్పగా.. సాదారణంగా పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు.. మీ బాబు ఒంట్లో బాగాలేకపోతేన, ఆకలి వేస్తేనో తప్ప అస్సలు ఏడ్వడు అంటుంది. అవును పిన్ని అంటూనే కూరగాయలు కట్ చేస్తానంటుంది. కానీ మీనాక్షి మాత్రం వద్దమ్మా.. ఇది తప్ప నాకు చేయడానికి వేరే పనేది లేదంటుంది. అప్పుడే అక్కడకు అవని రాగా.. బాబుకు ఉగ్గు తయారు చేయాలి, కందిపప్పు డబ్బా ఇటివ్వు అని అడుగుతుంది. దీంతో ఓ డబ్బా ఇస్తుంది అవని. అది చూసిన మీనాక్షి.. ఏంటే కందిపప్పు అడిగితే దనియాలు ఇచ్చావని అంటుంది. కందిపప్పు తీసుకురా అంటుంది. దీంతో మళ్లీ అవని.. మినపప్పు ఇస్తుంది. ఇదేంటని మీనాక్షి అడగ్గా.. ఈసారి కూడా చేతికి అందిన డబ్బా ఇస్తుంది. అది చూసిన మీనాక్షి అమ్మా అవని మళ్లీ దనియాల డబ్బానే ఇచ్చావే అంటుంది. ఆమె పరధ్యానంగా ఉండడం చూసి.. ఏమైందక్కా అని శ్రియా అంటుంది. మీనాక్షి కూడా ఏం ఆలోచిస్తున్నావని అనగా.. ఏ ఏడాదికో, రెండోళ్లకో వచ్చే ఆ శ్రీరామ్ తల్లి, సడెన్‌గా మన ఇంటికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదంటుంది. పార్వతికి బాలేదని తెలిసి పరామర్శించడానికి వచ్చిందని చెప్పింది కదా అని మీనాక్షి అనగా.. అత్తయ్యకు బాగాలేదన్న విషయం మనం బయట వాళ్లకు ఎవరికీ చెప్పలేదు కదమ్మా అంటుంది. కమల్ తన ఫ్రెండ్ శ్రీరామ్‌కు చెప్పుంటాడేమో అని అంటుంది. ఆ శ్రీరామ్ వాళ్ల అమ్మకి చెప్పుంటాడేమో అనగా.. ఆ విషయం కమల్‌ను అడిగానని, కానీ తనెవరికీ చెప్పలేదన్నాడని అంటుంది. ఎవరో చెబితే వచ్చినట్లుగానే నాకు అనిపిస్తోందని అవని అనుమానం వ్యక్తం చేస్తుంది. మన ఇంట్లో ఆవిడతో ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు ఎవరూ లేరని అనగా.. మరైతే ఆవిడకు ఎలా తెల్సి ఉంటుందంటావు అని మీనాక్షి అంటుంది. అదే అర్థం కావట్లేదమ్మా అని అవని చెబుతుంది. నువ్వు తెలివిగా కవర్ చేసి ఉండకపోతే.. మనం అత్తయ్యకు కచ్చితంగా నిజం చెప్పి ఉండాల్సింది అక్కా అంటుంది శ్రియా. ఆవిడకు ఫోన్ చేసి పిలిపించాల్సిన అవసరం ఎవరికుంటుంది అని మీనాక్షి అనగా.. అదే నాకూ తెలియట్లేదని అంటుంది అవని. వచ్చిన ఆవిడ అత్తయ్యకు బాగాలేరని చెప్పారంటే.. ఆ విషయం ఎవరో ఆవిడకు చెప్పారని చెబుతుంది. కావాలనే రమ్మని పిలిపించారంటుంది. అందుకే ఆవిడ వచ్చారని వివరిస్తుంది. ఆలోచిస్తుంటే.. అత్తయ్యకు మామయ్యగారి చెప్పాలని ఎవరో ఆలోచిస్తున్నారని నాకనిపిస్తోందని అంటుంది అవని. మీకు తెలియనిది, మీకు ఇంట్లో వాళ్లెవరూ చెప్పనిది అంటూ పల్లవి పార్వతికి నిజం చెప్పే సీన్ రివైన్ చేసుకున్న అవని.. ఆమెపైనే అనుమానపడుతుంది. తనని చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాను కాబట్టి.. తనే వేరే వాళ్లతో చెప్పిండానికి ప్రయత్నిస్తోందా అని అనుకుంటుంది. ఎవరు చెప్పి ఉంటారక్కా అని శ్రియా, అయినా అలా మరొకరితో చెప్పించే అవసరం ఎవరికుంటుందమ్మా అని మీనాక్షి అడుగుతారు. దీంతో అవని తెలీదని, అనుమానం ఉంది కానీ.. ఎవరు చెప్పించారనేది నాకూ ఆధారం లేదంటుంది. అలాంటి ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను, తెలుసుకుని తీరుతాను, వాళ్లను వదిలి పెట్టనని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అక్షయ్, కమల్‌లు శ్రీరామ్ తల్లిని వాళ్లింటి దగ్గర దిగబెడతారు. మీరు ఇంటి వరకు వచ్చినందుకు థాంక్స్ అని చెప్పగా.. అది సరే బాబూ మీ ఇంట్లో వాళ్లు నన్ను చూసి దెయ్యం అంటున్నారేంటని అడుగుతుంది. నా కొడుకు నీ ఫ్రెండ్ కదా, వాడి పేరు శ్రీరామ్ కదా.. మరి శ్రీరాజ్ అంటున్నారేంటని అంటుంది. శ్రీరాజ్ ఎవరని నిలదీస్తుంది. నీరు నాకు పిండం పెట్టడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అంటుంది. అసలేం జరిగిందని నిలదీయగా.. శ్రీకర్ కారులోంచి దిగి వెళ్దాం పదండి అంటాడు. దీంతో ఆమెకు ఏం చెప్పకుండానే శ్రీకర్ పిలవగా.. వెళ్లిపోతారు. నాన్న పోయారన్న విషయం ఆమెకి చెప్తే.. ఆవిడ అమ్మకి చెప్పేసే అవకాశం ఉంది కదన్నయ్యా.. వదిన కవర్ చేసింది కాబట్టి సరిపోయిందని శ్రీకర్ అంటాడు. ఆవిడ వచ్చే టైంకి వదిన లేకపోయి ఉంటే.. అమ్మకి ఈరోజు నిజం తెలిసిపోయుండేది కదా అంటాడు. రెండు నిమిషాలు ఆలస్యం అయినా అమ్మకి ఈ విషయం తెలిసిపోయేది అని అక్షయ్ అంటాడు. కమల్ మాత్రం.. తన నాన్నను తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అమ్మని మనం మోసం చేస్తున్నామని అంటాడు. బామ్మని చూస్తే ఏడుపొస్తుందని, అమ్మ ముందు నిలబడలేకపోతున్నానన్నయ్యా అంటాడు. జరిగింది అమ్మకు చెప్పేయాలనిపిస్తోందని చెబుతాడు. ఏడుపొస్తుందంటూ అక్షయ్ మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు నాకన్నా మొండోడివి అనుకున్నాను కానీ నువ్వే ఇలా అయిపోతే ఇలా ఎలారా అంటాడు. నాక్కూడా అమ్మకు నిజం చెప్పాలనే ఉందని, కానీ నాన్న ఎలాగూ లేరు, ఈ విషయం తెలిస్తే అమ్మ కూడా లేకుండా పోతుందని భయమేస్తుందని చెబుతాడు. అమ్మ ఆరోగ్యం కొంచెం మెరుగయ్యాక జరిగిన విషయం వదిన అమ్మకు చెబుతానంది కదా.. అప్పటి వరకు ఆగురా అంటారు. ఇందుకు కమల్ కూడా ఓకే చెప్పగా.. మళ్లీ కారెక్కి వెళ్లిపోతారు ముగ్గురు అన్నదమ్ములు. మరోవైపు అవని.. పల్లవినే అనుమానిస్తుంది. అసలు పల్లవి ఎందుకు చెప్పాలనుకుంటుంది, అత్తయ్యకు చెబితే పల్లివికి వచ్చే లాభం ఏంటని ఆలోచిస్తుంటుంది. అనవసరంగా నేను పల్లవిని అనుమానిస్తున్నానేమో అనుకుంటుండగా.. పల్లవి గతంలో తను చేసిన తప్పులన్నీ తెల్సుకుని మంచిగా మారిందని మీనాక్షి చెబుతుంది. మనందరితో కలిసిపోయి సంతోషంగా, సరాదాగా ఉంటుందని చెబుతుంది. మీ మామయ్యగారు పోవడంతో.. పల్లవి ముఖంలో ఆ సంతోషం లేకుండా పోయింది చూశావా అంటుంది. తల్లి పోయిన బాధను మర్చిపోయి సంతోషంగా ఉంటున్న టైంలో మామయ్యగారు పోయారని అంటుంది. అందుకు పల్లవి బెంగ పెట్టుకుందని చెబుతుంది. మనమే పల్లవికి కొంచెం ధైర్యం చెబితే బాగుంటుందని తీసుకెళ్లగా.. హాయ్,




