
విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా సారథ్యంలో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తాము పరిశీలించాల్సి ఉందని, వాటిని తమ ముందుంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమిషన్ ఏర్పాటు వెనుక ఉద్దేశం ఏంటి? ఏయే అంశాలపై అది అధ్యయనం చేసిందో తదితర వివరాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది.





