
శీతాకాలంలో మార్కెట్లలో తాజా కాలీఫ్లవర్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే చాలామంది కాలీఫ్లవర్‌తో కేవలం ఆలు-గోబీ ఫ్రై లేదా సాధారణ కుర్మా చేస్తుంటారు. అలా కాకుండా శుభకార్యాలు, ఫంక్షన్లలో వడ్డించేలా తాజా దినుసులతో ప్రత్యేక మసాలా నూరి, పచ్చికొబ్బరి పేస్ట్‌తో చిక్కటి గ్రేవీ పెట్టి వండితే ఆ రుచి రెస్టారెంట్ కూరలను సైతం తలదన్నుతుంది. ముఖ్యంగా కాలీఫ్లవర్‌లో ఉండే సూక్ష్మ క్రిములు పోయేలా ఉప్పు-పసుపు నీళ్లలో బ్లాంచ్ చేసి, పువ్వులు మెత్తబడి విరిగిపోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఈ కూరను ఎలా తయారుచేసుకోవాలో స్పైస్ ఫుడ్ కిచెన్ అందించిన విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.





