
ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న రావడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్పై ఆసక్తి పెరిగింది. జనవరి 26న సినిమాను విడుదల చేయాలనే చర్చలు జరుగుతున్నట్లు కథనం పేర్కొంది. ఒకవేళ ‘ఫౌజీ’ జనవరికి మారితే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా. మార్చి 5న రావాల్సిన ‘స్పిరిట్’ కనీసం నెల రోజులు వాయిదా పడే అవకాశంపై కూడా టాక్ వినిపిస్తోంది.





