
అతను బీటెక్‌ వరకు చదివి గిగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్న యువకుడు. పట్టణంలోని దారులన్నీ అతనికి బాగా తెలుసు. బైక్‌పై చక్కర్లు కొడుతుంటాడు. అలా తిరుగుతున్న క్రమంలో బైక్‌ మారదు. కాని నెంబర్లు ప్లేట్లు మాత్రం మారుతుంటుంది. రోజుకో నెంబరు ప్లేట్‌ దర్శనమిస్తుంది. వేషభాషలు కూడా మారిపోతాయి. గిగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్న యువకుడు ఇంతటి వేషాలు ఎందుకు వేస్తున్నాడు. కొంపతీసి స్పై అడ్డానా..? అంటే కాదు. లేదా ప్రైవేట్‌ డిటెక్టివ్‌నా? అదీ కాదు. మరి ఎందుకు అతను రోజుకో రకంగా మారిపోతున్నాడు. ఒకరోజు పోలీసులు ఎందుకు అతని ఇంటి తలుపులు తట్టారు. ఒక గిగ్‌ వర్కర్‌ను సీసీ కెమెరాలో పర్యవేక్షించాల్సిన అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ కథనంలో చూద్దాం..





