
ENG vs SL: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. జోస్ బట్లర్ 80 పరుగులతో చెలరేగగా, కెప్టెన్ హరి బ్రూక్ 42 బంతుల్లో సెంచరీతో 114 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ 254 పరుగులు చేయగా, శ్రీలంక 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది.
ENG vs SL: అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు తన బాదుడు ఏంటో మరోసారి చూపించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించి, ఆ తర్వాత ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి 119 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుత సెంచరీతో రికార్డులు సృష్టించాడు.





