
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఆరంభం నుంచే పూర్తి దూకుడు ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సీనియర్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు పూర్తిగా ఊచకోత కోశారు. తొలి బంతిని అభిషేక్ శర్మ 93 మీటర్ల భారీ సిక్సర్‌గా మలచగా, రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చారు. ఆ తర్వాత స్ట్రైకింగ్లోకి వచ్చిన సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ చేస్తూ స్క్వేర్ లెగ్ మీదుగా 71 మీటర్ల సిక్సర్ బాదిన ఆయన, ఆపై వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టారు. ఆఖరి బంతికి స్ట్రెయిట్ బౌండరీ మీదుగా మరో భారీ సిక్సర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు వచ్చి చేరాయి.





