
Matt Renshaw Maiden Century: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మ్యాట్ రెన్షా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తన అంతర్జాతీయ వన్డే కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆయన, ఆసీస్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అరుదైన ఫీట్‌ను అందుకోవడం గమనార్హం. జింబాబ్వేపై ఒక ఆస్ట్రేలియా బ్యాటర్ వన్డే శతకం సాధించి దాదాపు 22 సంవత్సరాలు గడిచింది. గతంలో 2004 సంవత్సరంలో హరారే (Harare) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ (Michael Clarke) నాటౌట్‌గా 105 పరుగులు చేశాడు. ఆ తరువాత ఇన్నాళ్లకు మళ్లీ అదే ప్రత్యర్థిపై మూడంకెల స్కోరును అందుకున్న ఆసీస్ క్రికెటర్‌గా రెన్షా సరికొత్త చరిత్ర లిఖించాడు.
Tags:#michael-clarke