
Telangana Election Commission : తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా 78.30 శాతం ఎన్యుమరేషన్ పత్రాలు అందించినట్లు తెలిపారు. 2.73శాతం మంది చనిపోయిన వారిగా గుర్తించినట్లు చెప్పారు. మరోవైపు సుమారు 60లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నారని.. అలాగే 32లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించండం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 92లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల సంఘం నోటీసులు అందుకున్న వ్యక్తులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు ఉంటుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే ఫారం -6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
ముసాయిదా జాబితాకోసం ఇక్కడ క్లిక్ చేయండి..





