
శంఖవరం: కాకినాడ జిల్లాలోని శంఖవరం మండలం శృంగధార గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన భార్యను వేధిస్తున్నాడనే కారణంతో రాజవొమ్మంగి మండలం వాతంగి పంచాయతీ ఓంపాలెం గ్రామానికి చెందిన ముర్ల మాణికుమార్ (32)ను మహిళ భర్త కాకూరి చంద్రయ్య కత్తితో నరికి హాత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొన్న అన్నవరం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





