
ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ( Donald Trump ).. ఆయన సహాయకురాలు నటాలీ హార్ప్‌ (Natalie Harp)ను ముద్దు పెట్టుకుంటున్నట్లుగా ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గోల్ఫ్‌ (Golf) కోర్టులో ఈ ఫొటో తీసినట్లు కనిపిస్తోంది. ట్రంప్‌, హార్ప్‌ మంచి స్నేహితులని.. అందులో ఇతర అర్థాలకు తావులేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ చిత్రంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫొటోలో హార్ప్‌ చేతికి ఆరు వేళ్లు ఉన్నాయని.. ఇది ఏఐ (Artificial Intelligence)తో రూపొందించిన ఫొటో అయి ఉండొచ్చని అంటున్నారు. ట్రంప్‌తో కలిసి హార్ప్‌ గతంలో వర్జీనియాలోని గోల్ఫ్‌ క్లబ్‌లో, ఐర్లాండ్‌ పర్యటనలోనూ కనిపించారు. ఏఐతో ముప్పులేదు.. అంతా దుష్ప్రచారమే: ట్రంప్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





