
జనరల్‌ స్టడీస్‌-ఇండియన్‌ పాలిటీ భారత రాజ్యాంగం ఒక విశిష్టమైన వ్యవస్థాత్మక నిర్మాణం. అందులోని 7 నుంచి 12 భాగాలు దేశ పరిపాలనా వ్యవస్థకు, వికేంద్రీకరణకు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు అత్యంత కీలకమైన పునాదులు. దేశ సర్వోన్నత స్థానం నుంచి వీధి చివరి పంచాయతీ వరకు అధికారాలను ఏ విధంగా విస్తరించాలో ఈ భాగాలు స్పష్టంగా దిశానిర్దేశం చేస్తాయి. రద్దయిన ఏడో భాగం పునర్నిర్మాణ చరిత్రను గుర్తుచేస్తే, ఎనిమిదో భాగం కేంద్రపాలిత ప్రాంతాల పాలనను, పదో భాగం గిరిజన ప్రాంతాల ప్రత్యేక హక్కులను పర్యవేక్షిస్తుంది. ఇక 9, 9-ఎ, 9-బి భాగాలు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలతో పాటు సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించి, అధికారాన్ని నేరుగా ప్రజల చేతుల్లోకి తెచ్చిన ‘ప్రజాస్వామ్య విప్లవాలు’. 11, 12 భాగాలు దేశ ఐక్యత దెబ్బతినకుండా కేంద్ర-రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక బంధాలను ముడివేసి ఉంచే నిబంధనలు. ఈ అంశాలపై పోటీ పరీక్షార్థులు సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. సంబంధిత ఆర్టికల్స్, సవరణ చట్టాల సంవత్సరాలను పట్టికల రూపంలో రాసుకుని చదువుకోవాలి. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




