
22ఏ వివాదాన్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామని, పేదవారికి ఒక గుంట భూమిగానీ, పైసా నష్టంగానీ జరగకుండా చూస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. 22ఏ వివాదం పరిష్కారం కోసం సీసీఎల్ఏ కమిషనర్, స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ, న్యాయశాఖ కార్యదర్శితో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని తెలిపారు





