
ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ కలిగిన డీపట్టా భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లాలో డీపట్టాలు కలిగిన రైతులు క్రయ విక్రయాలకు అవకాశం వచ్చినట్టయింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024 జూన్‌లో ఫ్రీహోల్డ్ భూముల లావాదేవీలపై విధించిన ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. అయితే వివాదాస్పద భూములపై నిషేధం కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.





