ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం తిరుమలలోని ఎస్వీ మ్యూజియంను ప్రారంభించారు. మ్యూజియంలో 9 గ్యాలరీలు, 14 వేల కళాఖండాలు ఉన్నాయి. శ్రీవారి ఆభరణాల నమూనాలు, చారిత్రక అంశాలను తెలిపేలా వస్తు ప్రదర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారి కిరీటాలు, ఆభరణాలు త్రీడీ మోడల్‌లో చిత్రీకరించి ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. ఏఐ వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాల ప్రదర్శనను సీఎం ఈ సందర్భంగా తిలకించారు.





