
రాష్ట్రంలోని అన్ని రంగాలను, అన్ని వర్గాలనూ బలోపేతం చేసేలా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు చేరాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) 236వ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.





