

Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో రోజుకు సంబంధించిన ఫస్ట్ ప్రొమో వచ్చేసింది. బ్లూ టీమ్ సభ్యులను ఓ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. రెడ్ టీమ్‌లో హౌస్‌మేట్‌గా మారడానికి మీరు అనర్హులుగా భావిస్తున్న 5 గురు సభ్యులు ఎవరో స్పష్టమైన కారణాలు చెప్పి వారి ఫోటోలపై పిన్‌తో గుచ్చాలని సూచించాడు.
రోహిత్, చరణ్, షాలిని, అమన్, శివ సృష్టి లను నామినేట్ చేస్తారు. ఆ తరువాత రెడ్ టీమ్ సభ్యులను పిలిచిన బిగ్‌బాస్.. బ్లూటీమ్లో హౌస్‌మేట్‌గా మారడానికి అనర్హులుగా భావిస్తున్న 5 గురిని టీమ్ అంతా కలిసి సెలక్ట్ చేయాలని చెబుతాడు.




