
ఇంటర్నెట్ డెస్క్‌: ఫుట్‌బాల్‌ ఆటలో వ్యక్తిగత విభాగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం బాలెన్ డి ఓర్ (Ballon d'Or 2026).. ఈ ఏడాదికి గానూ ఈ అవార్డును నెగ్గేదేవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 30 మందితో కూడిన జాబితా తయారైంది. ఇటీవలే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన లియోనెల్ మెస్సి (Lionel Messi) మళ్లీ పోటీ పడుతున్నాడు. ఇప్పటికే అతడు ఎనిమిది సార్లు ఈ అవార్డును సొంతం చేసుకుని రికార్డు సృష్టించాడు. అయితే, ఈసారి స్పెయిన్ సంచలనం లామినె యమాల్‌.. ఫ్రాన్స్‌ ఆటగాడు ఎంబాపె, నార్వే యోధుడు ఇర్లింగ్‌ హాలాండ్, బ్రెజిల్‌ స్టార్ విన్సియస్ జూనియర్.. వంటి ప్లేయర్లు కూడా రేసులో ఉన్నారు. మరి ఈ పురస్కార విజేతను ఎలా ఎంపిక చేస్తారు? ఎంత ప్రైజ్‌మనీ ఇస్తారో ఓ లుక్కేద్దాం.. బాలెన్ డి ఓర్ (Ballon d'Or 2026) అవార్డును గెలిచిన వారికి భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ వస్తుందని భావిస్తున్నారా? కానీ, అలాంటిదేమీ ఉండదు. ప్రత్యక్షంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అవార్డు గెలిచిన వారికి పరోక్షంగా భారీ ఆర్థిక ప్రయోజనాలు దక్కుతాయి. స్పాన్సర్‌షిప్‌లు, ప్రకటనలు అధికంగా వస్తాయి. మార్కెట్‌లో సదరు ప్లేయర్‌ విలువ పెరుగుతుంది. అప్పుడు క్లబ్‌తో ఒప్పందాలు చేసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





