
విజయవాడ రూరల్‌: అక్షరాంధ్ర పుస్తకం.. నిరక్షరాస్యులకు వరమని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సాయంత్రం విజయనగరంలోని తన కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు అక్షరాంధ్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం వల్ల కలిగే ప్రయోజనాలను వయోజన విద్యాశాఖ ఉప సంచాలుకుడు అల్లు సోమేశ్వరరావు వివరించారు. ఉల్లాస్ అక్షరాంధ్ర మూడవ విడత అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలో 1,26,422 మంది నిరక్షరాస్యులకు, 12,642 మంది వాలంటీర్ టీచర్లకు అక్షరాంధ్ర మార్గదర్శిని, అక్షరాంధ్ర సంక్షిప్తవాచకం, సాధన పత్రాలు పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేసినట్లు సోమేశ్వరరావు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





