
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను కొట్టాల్సి వచ్చిందని తెలిపారు.
Jun 30 2026 5:12 PM | Updated on Jun 30 2026 5:19 PM
డెలివరీ బాయ్ వివాదంపై రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్ స్పందించారు. అతన్ని కావాలని తాను కొట్టలేదన్నారు. అమ్మతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడంతోనే నేను కొట్టాల్సి వచ్చిందని తెలిపారు. తప్పుడు అడ్రస్‌లో ఇచ్చిన అతను.. మా అమ్మతో అసభ్యంగా మాట్లాడారని అఖిల్ రాజ్ తెలిపారు. మా అమ్మను నీచంగా మాట్లాడడంతోనే నేను కొట్టాల్సి వచ్చిందని అఖిల్ రాజ్ వెల్లడించారు. అంతేకానీ ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం నాకు ఏముందని అన్నారు.
ఇలా అడ్రస్ పొరపాటుగా దాదాపు పదిసార్లు జరిగిందని అఖిల్ రాజ్ తెలిపారు. నేను కూడా ఒకప్పుడు డెలివరీగా బాయ్‌గా పనిచేసి ఈ స్థాయికి వచ్చానని వెల్లడించారు. అడ్రస్ పొరపాటు వల్ల ఒకసారి కండోమ్స్, సిగరెట్స్ కూడా మా ఇంటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొడవతో మా అమ్మ, నాన్న కూడా పానిక్ అయ్యారని పేర్కొన్నారు. నెనైతే అతన్ని కావాలని కొట్టలేదు.. అతను తాగి వచ్చి అమ్మతో అసభ్యంగా మాట్లాడడం వల్లే నేను కొట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మాకు సంబంధం లేని ఆర్డర్ తీసుకొచ్చి నానా హంగామా చేసిన డెలివరీ బాయ్‌ను మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
ఈ వివాదంపై అఖిల్ రాజ్ స్పందిస్తూ..' మా ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదు. అయినా ఫుడ్ పార్శిల్ వచ్చింది. మా అమ్మ ఆ పార్శిల్ తీసుకుని ఎవరు ఆర్డర్ పెట్టారని అడిగింది. ఎవరూ ఆర్డర్ చేయలేదు అని తెలుసుకుని పక్కనే పెట్టేసింది. కొద్ది నిమిషాల తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫ్రీగా వస్తే తీసుకుంటారా అంటూ మా అమ్మను దుర్భాషలాడాడు. తాగిన మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మా అమ్మను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఒక కొడుకుగా నా బాధ్యతగా డెలివరీ బాయ్‌ను మర్యాదగా మాట్లాడమని మందలించా. ఆ డెలివరీ బాయ్ ఆ వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అసలు జరిగింది తెలుసుకోకుండా కొందరు నాపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఊరుకుంటారా. నేను ఒక హీరోగా ఇంకాస్త సంయమనం పాటించాల్సి ఉండాల్సింది. పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సింది. అయితే మా అమ్మను తిట్టినందుకు కోపం ఆపుకోలేకపోయా. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినే. ఇలా డెలివరీ బాయ్ పనులు చేసిన వాడినే. నా సినిమాలో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే చెప్పాం. అలాంటి నేను అకారణంగా డెలివరీ బాయ్‌తో ఎందుకు గొడవపెట్టుకుంటా. అతనితో గొడవ పెట్టుకుంటే నాకు వచ్చేదేంటి. నన్ను సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్న మిత్రుల కోసమే ఈ వివరణ ఇస్తున్నా' అని అన్నారు.
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!