
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్ వద్ద అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటిమట్టం భారీగా పెరగడంతో నది ఒడ్డున ఘాట్లన్నీ మునిగిపోయాయి. అధికారు
లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రమాదకర ప్రాంతాలపై నిఘా ఉంచారు. రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. స్థానిక ప్రజలతో పాటు చార్ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.. నదులు, వాగుల వద్దకు వెళ్లకూడదని సూచించింది. ఈ వీడియో చూశారా: ముంబయిలో భారీ వర్షాలు.. చెరువుల్లా మారిన రహదారులు