
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar).
డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి.
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కాయాదు లోహర్ (Kayadu Lohar). డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ భామ నటించిన తాజా చిత్రం ఇదయం మురళి. అధర్వ మురళి హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయాదు లోహర్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ హాట్ బ్యూటీస్ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ప్రీతి ఈ మధ్యనే బ్లాస్ట్ మూవీతో సక్సెస్ అందుకుంది. అందులో ఆమె తనతో అసభ్యంగా బిహేవ్ చేసిన కోలీగ్స్ ని చితక్కోడుతుంది. ఆలానే రియల్ లైఫ్ మీ బ్లాస్ట్ మూమెంట్ ఏంటి అని యాంకర్ ఈ ఇద్దరు బ్యూటీలను ఆడగగా.. కాయాదు లోహర్ తన పాఠశాల రోజుల్లో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకుని అందరినీ షాక్‌కు గురిచేసింది.
'స్కూల్ రోజుల్లో ఒక అబ్బాయి నన్ను నిరంతరం ఫాలో అవుతూ వేధించేవాడు. మొదట్లో నేను చాలా ఓపికగా వ్యవహరించాను. ఆ వయసులో గొడవలు ఎందుకని భావించి, సదరు అబ్బాయి చేసిన తప్పును రెండు సార్లు క్షమించి వదిలేశాను, కానీ, ఆ అబ్బాయి మాత్రం మారకుండా మూడోసారి కూడా హద్దులు దాటి ప్రవర్తించడంతో నాకు ఎంతో కోపం వచ్చింది. ఆ విపరీతమైన కోపంతో అక్కడే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి అతనిపైకి బలంగా విసిరాను. ఆ రాయి తగలడంతో అబ్బాయి తల పగిలి రక్తం వచ్చింది. ఆ తర్వాత అతను ఎప్పుడూ నా జోలికి రాలేదని' ఆమె గుర్తుచేసుకుంది.
అంతేకాకుండా తానేదో పైకి చాలా ప్రశాంతంగా, అమాయకంగా కనిపిస్తానని, కానీ ఎవరైనా గీత దాటాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనని, గట్టిగా బుద్ధి చెబుతానని స్పష్టం చేసింది. ఆడపిల్లలు వేధింపులను భరిస్తూ మౌనంగా ఉండకూడదని, తిరగబడాలని చెప్పకనే చెప్పింది. రియల్ లైఫ్ లో కాయాదు బోల్డ్ ఆటిట్యూడ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 10 వ తరగతిలోనే ఆమె ఇంత పనిచేసిందా అని కొందరు షాక్ అవుతున్నారు. ఇక తెలుగులో ఈ చిన్నది నాని సరసన ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
డెలివరీ బాయ్ తో గొడవ.. అఖిల్ రాజ్ వాదన ఏంటి
Prabhas Vs Balakrishna: డిసెంబర్లో.. ప్రభాస్, బాలయ్య ఢీ అంటే ఢీ
Pralay: రణ్‌వీర్‌సింగ్ రెడీ.. ఆస్ట్రేలియాలో షురూ..