
మలయాళ నటి హనీ రోజ్‌కు బిజినెస్మెన్ చెమ్మనూర్ బహిరంగ క్షమాపణలు తెలుపుతూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు. మలయాళ నటి హనీ రోజ్‌కు (Honey rose) )బిజినెస్మెన్ చెమ్మనూర్ బహిరంగ క్షమాపణలు తెలుపుతూ...
మలయాళ నటి హనీ రోజ్‌కు బిజినెస్మెన్ చెమ్మనూర్ బహిరంగ క్షమాపణలు తెలుపుతూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు.
మలయాళ నటి హనీ రోజ్‌కు (Honey rose) )బిజినెస్మెన్ చెమ్మనూర్ బహిరంగ క్షమాపణలు తెలుపుతూ ఫేస్బుక్ వేదికగా పోస్ట్ చేశారు. ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, తనపై పెట్టిన క్రిమినల్ కేసును ఆమె ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెమ్మనూర్ తనపై లైంగిక ్ఘభావనతో కూడిన వ్యాఖ్యలు చేశారని హనీరోజ్ ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశారు. ‘హనీ రోజ్పై నేను చేసిన వ్యాఖ్యలు ఆమెను, ఆమె కుటుంబాన్ని బాధపెట్టాయని అర్థమైంది. మనస్ఫూర్తిగా ఆమెను క్షమాపణలు కోరుతున్నా. ఈ విషయంలో సానుకూలంగా ముందుకు సాగడానికి కట్టుబడి ఉన్నాను’ అని అన్నారు. ‘నా లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను నేనూ స్వాగతిస్తాను. కానీ దేనికైనా ఓ హద్దు ఉంటుంది. నాపై అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే సహించను.. వారిని వదిలిపెట్టను’ అని అన్నారు.