
జ్యేష్ఠ పౌర్ణమి వేళ ఆకాశంలో అరుదైన ఖగోళ వింతతో పాటు జ్యోతిష్య పరంగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రావడమే కాకుండా, మూల నక్షత్రం కూడా తోడవడంతో చూడామణి...
జ్యేష్ఠ పౌర్ణమి వేళ ఆకాశంలో అరుదైన ఖగోళ వింతతో పాటు జ్యోతిష్య పరంగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి సోమవారంతో కలిసి రావడమే కాకుండా, మూల నక్షత్రం కూడా తోడవడంతో చూడామణి యోగం అనే అత్యంత శక్తివంతమైన, అరుదైన శుభయోగం రూపుదిద్దుకుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారంతో కూడిన పౌర్ణమిని చూడామణి యోగంగా పరిగణిస్తారు. ఈ విశేష పర్వదినాన నదీ స్నానాలు ఆచరించడం, పరమశివునికి అభిషేకాలు చేయడం, లక్ష్మీనారాయణులను, దుర్గాదేవిని ఆరాధించి దానధర్మాలు చేయడం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.అంతేకాదు, ఇదే రోజున మహిళలు తమ సౌభాగ్యం కోసం భక్తిశ్రద్ధలతో వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు. మర్రిచెట్టుకు పూజలు చేసి, పసుపు-కుంకుమలు సమర్పించి ముత్తైదువతనాన్ని కోరుకుంటారు. ఈ చూడామణి యోగం ప్రభావంతో ద్వాదశ రాశులలో ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ఊహించని ధనలాభాలతో వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది. ఆ లక్కీ రాశుల వివరాలు తెలుసుకుందాం.ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?మేష రాశిమేష రాశి వారికి ఈ యోగం విదేశీ యోగాన్ని తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఎక్కడో చిక్కుకుపోయిన, ఇక రాదనుకున్న డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. పాత అప్పుల బాధల నుంచి విముక్తి లభించి ప్రశాంతత చేకూరుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు రెట్టింపవుతాయి.కన్యా రాశికన్యా రాశి వారికి ఈ సమయం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అనుకోకుండా ధనలాభం లేదా లాటరీల ద్వారా ఊహించని డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు, లీగల్ సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు ఈ కాలం గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. కుటుంబంలో శుభవార్తలు వింటారు.మేష రాశి, వృషభరాశి వారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?తులా రాశితులా రాశి వారికి చాలా కాలంగా నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరిగి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవీ యోగం పట్టే అవకాశం ఉంది. సొంత ఇల్లు కొనాలనే మీ చిరకాల స్వప్నం ఈ కాలంలో సాకారమవుతుంది.ధనుస్సు రాశిధనుస్సు రాశి వారికి ఆస్తి కలిసి వస్తుంది. కొత్త ఇల్లు లేదా స్థలాలు కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఉన్న పాత మనస్పర్థలు, వివాదాలన్నీ తొలగిపోయి మళ్లీ సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ఈ చూడామణి యోగం విపరీతమైన లాభాలను తెచ్చిపెడుతుంది.