
ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. సరైన ఆహారం కూడా అంతే కీలకం. చాలామంది ఉదయం ఏమీ తినకుండా నేరుగా జిమ్‌కు వెళ్లడం లేదా పరుగులు తీయడం చేస్తుంటారు.
ఇది కొందరికి ఉపయోగపడినా, అందరికీ మంచిదికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేసే విధానం, తీవ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలని సూచిస్తున్నారు.ఖాళీ కడుపుతో చేసే వ్యాయామాన్ని ‘ఫాస్టెడ్ వర్కౌట్’ అంటారు. తక్కువ తీవ్రతతో చేసే నడక, తేలికపాటి కార్డియో వంటి వ్యాయామాల్లో ఇది కొంతమేర కొవ్వు కరిగేందుకు సాయపడొచ్చు. అయితే అధిక తీవ్రతతో చేసే వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్, ఎక్కువసేపు కొనసాగే వర్కౌట్లకు శరీరానికి ముందే శక్తి అవసరం. అలాంటి సమయంలో ఏమీ తినకుండా వ్యాయామం చేస్తే త్వరగా అలసట వస్తుంది. పనితీరు తగ్గుతుంది. కొందరికి తల తిరగడం, బలహీనంగా అనిపించడం కూడా జరగొచ్చు. కండరాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. కొద్దిపాటి ప్రొటీన్ కండరాల సంరక్షణకు ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ నూనె, కొవ్వులు, అధిక పీచు ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణక్రియ నెమ్మదించి వ్యాయామం సమయంలో అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది.వ్యాయామానికి ముందు ఓట్స్‌తో ప్రొటీన్ పౌడర్, గోధుమ బ్రెడ్‌తో గుడ్లు, పెరుగు, కాల్చిన మఖానా, స్మూతీ, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్, అరటిపండు వంటి ఆహారాలు మంచి ఫలితాలిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని